యాప్నగరం

ఉద్యోగాలు ఇప్పిస్తోన్న హైదరాబాద్ పోలీసులు.. జాబ్ కావాలంటే ఇక్కడికి రండి!

శాంతి భద్రతలను కాపాడటం, ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించకుండా చూడటం.. ఆకతాయిల ఆట కట్టించడంలో ముందున్న హైదరాబాద్ సిటీ పోలీసులు యవత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

Samayam Telugu 20 Jan 2021, 5:57 pm
సమాజంలో శాంతి భద్రతలను కాపాడం, ఆకతాయిల ఆట కట్టించడమే పోలీసుల ప్రధాన విధి. కానీ తమకు అంతకు మించి బాధ్యత ఉందని హైదరాబాద్ సిటీ పోలీసులు చాటుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనల గురించి.. సైబర్ మోసాల గురించి నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కూడా హైదరాబాద్ సిటీ పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
Samayam Telugu job representative
Representative image


30కిపైగా కంపెనీల్లో 3000కు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు ‘జాబ్ కనెక్ట్‌’ను హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ అని మూడు రకాలుగా విభజించారు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీటెక్, బీఫార్మసీ చదివిన వారిని స్కిల్డ్ విభాగంలో.. డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ చదివిన వారిని సెమీ స్కిల్డ్ విభాగంలో... టెన్త్ పాస్ లేదా ఫెయిల్ అయిన వారిని అన్ స్కిల్డ్ విభాగంలో చేర్చారు.
చేసే పనిని బట్టి జీతం రూ.10 వేల నుంచి రూ.25 వేలు అంతకంటే ఎక్కువగా ఉంటుందని పోలీసు శాఖ తెలిపింది. ఉద్యోగం కావాలని భావించే వారు జనవరి 23న సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్‌వీఐటీ ఇంజినీరింగ్ కాలేజీకి రావాలని సూచించింది. వచ్చేటప్పుడు మూడు కాపీల రెజ్యుమో తీసుకురావాలని.. మాస్క్ ధరించడం తప్పనిసరని సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.