యాప్నగరం

ఘోర రోడ్డు ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్, ఐదుగురు కుటుంబసభ్యులు మృతి

Hyderabad Head Constable Family Killed in Bidar Road Accident: కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన ఆరుగురు మృతి చెందారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న గిరిధర్‌ (45) తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని కలబురిగి జిల్లా గాన్గాపూర్‌లో ఉన్న దత్తాత్రేయ స్వామి దర్శనానికి బయల్దేరారు. బీదర్‌ జిల్లాలోని బంగూరు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు కంటైనర్‌ను వెనక నుంచి ఢీకొట్టింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 16 Aug 2022, 10:23 am
బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Bidar Road Accident) చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న గిరిధర్‌ (45) తన కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలోని కలబురిగి జిల్లా గాన్గాపూర్‌లో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి బయల్దేరారు. మొత్తం 10 మంది బయల్దేరారు. బీదర్‌ జిల్లాలోని బంగూరు వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కంటైనర్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరిలో రెండేళ్ల ఓ చిన్నారి కూడా ఉంది. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఇంకొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు.
Samayam Telugu Hyderabad Constable family killed in Bidar Road Accident
బీదర్ రోడ్డు ప్రమాదం


ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోయాయి. మృతులను గిరిధర్ (45), అనిత (30), ప్రియ (15), మహేశ్‌ (2)తో పాటు డ్రైవర్‌ జగదీశ్‌ (35)గా గుర్తించారు. గాయపడిన వారిని బీదర్‌ జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకొని స్థానిక పోలీసులు ఘటనా స్థలికి వచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. బీదర్ తాలూకా మన్నల్లి పోలీస్ స్టేషన్‌లో ఘటనపై కేసు నమోదు చేశారు..
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.