యాప్నగరం

HCA తప్పేం లేదు.. మ్యాచ్ నిర్వహణ అంటే అంత తేలికేం కాదు: అజారుద్దీన్

Hyderabad Cricket Association: IND vs AUS T20 క్రికెట్ మ్యాచ్‌ టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఘటనలో తమ తప్పేమీ లేదని HCA అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. తోపులాట జరగడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన.. ఏం జరిగిందనే అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. మ్యాచ్‌ నిర్వహణ అంటే అంత తేలికేం కాదన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా టికెట్లు అయిపోయాయని చెప్పడం గమనార్హం. టికెట్ల వివరాలను మీడియాకు తర్వాత చెబుతామన్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 22 Sep 2022, 9:25 pm
భారత్‌ - ఆస్ట్రేలియా టీ20 క్రికెట్ మ్యాచ్‌ టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఘటనలో తమ తప్పేమీ లేదని HCA అధ్యక్షుడు అజారుద్దీన్‌ అన్నారు. తోపులాట జరగడం దురదృష్టకరమని పేర్కొన్న అజార్.. ఏం జరిగిందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఒకింత అసహనంతో స్పందించిన అజారుద్దీన్.. మ్యాచ్‌ నిర్వహణ అంటే అంత తేలికేం కాదన్నారు. టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలపై ప్రశ్నించగా.. టికెట్ల వివరాలను రేపు వెల్లడిస్తామని తెలిపారు. ఇంత జరిగాక కూడా టికెట్లు అయిపోయాయని చెప్పడం కొసమెరుపు.
Samayam Telugu Mohammad Azharuddin
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం


జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల కోసం తోపులాట చోటు చేసుకొని పలువురు గాయపడిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హుటాహుటిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంటే.. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని హెచ్‌సీఏ సభ్యులను ప్రశ్నించారు. ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే తగిన చర్యలు తీసుకొని ఉండేవాళ్లం కదా అని వారితో అన్నారు.

‘తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలుస్తోంది. హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా ఖ్యాతి గడిస్తోంది. ఇలాంటి సమయంలో ఇలాంటి ఘటనలతో నగరం పరువు పోతుంది. కనీస జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది కదా’ అని హెచ్‌సీఏ సభ్యులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ సమన్వయం చేసుకొని ఈవెంట్‌ను విజయవంతం చేయాలని సూచించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడిన అనంతరం అజారుద్దీన్‌ మాట్లాడారు. హెచ్‌సీఏలో లోపాలను సవరించుకుంటామని అన్నారు. తెలంగాణకు మరింత ఖ్యాతి వచ్చేలా హెచ్‌సీఏ చర్యలు ఉంటాయని చెప్పారు. ‘మ్యాచ్‌ నిర్వహణ చాలా అంశాలతో కూడుకొని ఉంటుంది. కూర్చొని మాట్లాడుకున్నంత సులభం కాదు. చాలా ఏళ్ల తర్వాత మ్యాచ్‌ నిర్వహించుకునే అవకాశం వచ్చింది. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. బాధితులకు హెచ్‌సీఏ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌లను నిర్వహిస్తాం’ అని అజార్ అన్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.