యాప్నగరం

మళ్లీ నిలిచిపోయిన మెట్రో సేవలు.. అప్రమత్తమైన అధికారులు

Hyderabad Metro: అప్రమత్తమైన మెట్రో అధికారులు రైళ్లను పునరుద్ధరించేందుకు మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా జనవరి 21న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5 వద్ద మెట్రో రైలు 15 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Samayam Telugu 26 Jan 2021, 6:27 pm
హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్వహణలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం నాగోల్‌ స్టేషన్‌ డేటా కంట్రోల్‌ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అన్ని మెట్రో రూట్లలో రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మియాపూర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వైపు వెళ్తున్న రైలులోనూ సాంకేతిక లోపం తలెత్తగా గాంధీభవన్‌ స్టేషన్‌లో మెట్రో నిలిచిపోయింది. మరోవైపు ముసారాంబాగ్‌లోనూ 15 నిమిషాలకు పైగా మెట్రో సేవలు ఆగిపోయాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
hyderabad metro


దీంతో అప్రమత్తమైన మెట్రో అధికారులు రైళ్లను పునరుద్ధరించేందుకు మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా జనవరి 21న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5 వద్ద మెట్రో రైలు 15 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్‌ లోపాలు, సాంకేతిక సమస్యలతో తరచూ మెట్రో రైళ్లు ఆగిపోతున్నాయి. తర్వాత కాసేపటికే అధికారులు సమస్యను పరిష్కరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.