యాప్నగరం

మళ్లీ నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు.. ఈసారి ఎక్కడంటే..

Ameerpet: ఇటీవల కూడా మెట్రో రైలులో ఇలాంటి సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడు మెట్రో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి.

Samayam Telugu 20 Jan 2021, 7:15 pm
హైదరాబాద్‌ మెట్రో రైలు మరోసారి నిలిచిపోయింది. ప్రయాణికులతో వెళ్తుండగా బుధవారం ఈ ఘటన తలెత్తింది. మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు 15 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. అమీర్‌పేట్‌ నుంచి జూబ్లీహిల్స్‌ మార్గంలో సమస్య తలెత్తగా రైలు అక్కడిక్కడే ఆగిపోయింది. సాంకేతిక సమస్యతో 15 నిమిషాల పాటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో స్పందించిన మెట్రో అధికారులు స్టేషన్‌లో ప్రయాణికులను దింపేసి ఖాళీ రైలును పంపించారు.
Samayam Telugu హైదరాబాద్ మెట్రో
hyderabad metro


కాగా, ఇటీవల కూడా మెట్రో రైలులో ఇలాంటి సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యల కారణంగా అప్పుడప్పుడు మెట్రో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. మెట్రో రైలులో రద్దీగా ఉన్న సమయాల్లో ప్రయాణికులు కొందరు ద్వారాల పక్కన గోడకు ఆనుకొని నిలబడి ఉండడం వల్ల రైలు ఉన్నట్లుండి ఆగిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. ప్రయాణికులు ఎమర్జెన్సీ బటన్‌ను గమనించకుండా దానికి ఆనుకోవడం ద్వారా అది నొక్కబడుతోంది. దీంతో రైలు అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇలా జరుగుతుండడంపై మెట్రో అధికారులు ఎమర్జెన్సీ బటన్ చుట్టూ జాలీ వంటి దాన్ని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.