యాప్నగరం

Hyderabad: వాహనాదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ వెహికల్స్ సిటీలో తిరగటానికి వీళ్లేదు!

Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీకి పోలీసులు చర్యలు చేపట్టారు. నగరంలో పలు వాహనాలపై ఆంక్షలు విధించారు. ఇకపై ఆ వాహనాలు నగరంలో తిరగటానికి వీల్లేదని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 16 Apr 2023, 2:58 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి పోలీసుల చర్యలు
  • పలు వాహనాలపై నిషేదం
  • మరికొన్ని వాహనాలపై ఆంక్షలు విధింపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu traffic control
హైదరాబాద్ ట్రాఫిక్
Hyderabad: హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. వేగంగా విస్తరిస్తున్న నగరంతో ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది. పోలీసులు ఎన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించినా.. రద్దీ తగ్గటం లేదు. జఠిలమవుతున్న ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీతో పాటు ప్రమాదాలను నివారించేందుకు నగరంలో పలు వాహనాలపై ఆంక్షలు విధించారు. ట్రాక్టర్లు, వ్యవసాయ పనుల్లో వినియోగించే యంత్రాలతో పాటు ఎద్దుల బండ్లు, సైకిల్ రిక్షాల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అలాంటి వాహనాలపై నగరంలో నిషేదం విధిస్తున్నట్లు సీపీ ఆనంద్ ప్రకటించారు.
వీటితో పాటు నేషనల్‌ పర్మిట్‌ లారీలు, అంతర్రాష్ట్ర వాహనాలు, లోకల్‌ లారీలు, గూడ్స్‌ వంటి భారీ వాణిజ్య వాహనాలను, ప్రైవేట్‌ బస్సులపై పలు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. 10 టన్నుల కంటే ఎక్కువ బరువు వస్తువులను సరఫరా చేసే గూడ్స్ వెహికల్స్‌ను నగరంలోని పలు ప్రాంతాలలో ఉదయం, రాత్రి సమయాల్లో రాకపోకలను నిషేధించారు. నిర్మాణ సామగ్రిని మోసుకెళ్లే వాహనాలు, లోకల్‌ లారీలకు రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య అనుమతి ఉంటుందని సీపీ చెప్పారు.

3.5 టన్నుల నుంచి 12 టన్నుల లోపు బరువు వస్తువులను సరఫరా చేసే వాహనాలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల మధ్య మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఇక జంట నగరాలు (హైదరాబాద్ - సికింద్రాబాద్‌)లలో ప్రైవేట్‌ బస్సులకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య నడపడానికి అనుమతి లేదని సీపీ వెల్లడించారు.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.