యాప్నగరం

ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్న భార్య.. రేపు అనగానే, వెంటనే వీడియో కాల్.. షాక్

సోదరి వివాహానికి వెళ్లిన భర్తని వెంటనే రావాలని కోరింది భర్త. ఈరోజు కుదరదని.. రేపు బయలుదేరతానని చెప్పినా వినిపించుకోకుండా పట్టుబట్టింది. ఇంతలోనే భార్య వీడియో కాల్ చేయడంతో భర్త షాక్‌కి గురయ్యాడు.

Samayam Telugu 1 Sep 2021, 9:42 pm
భార్య మాట వినడం లేదనో.. భర్త ప్రేమగా చూసుకోవడం లేదనో.. లేనిపోని అనుమానాలు.. అనవసరపు పెత్తనాలతో పెడదోవ పట్టి దారుణాలకు ఒడిగడుతున్నారు. చిన్నచిన్న విషయాలకే కొందరు జీవితంపై విరక్తి పెంచుకుంటున్నారు. క్షణం ఆలోచించకుండా చావే తమ సమస్యలకి శరణ్యమని మృత్యుదేవతని ఆహ్వానిస్తున్నారు. డిప్రెషన్‌కి గురై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి ఓ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పెళ్లైన ఎనిమిది నెలలకే యువతి ఆత్మహత్య చేసుకుంది. భర్తకి వీడియో కాల్ చేసి మరీ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. సేకరించిన వివరాల మేరకు..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
woman


సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయి శివ, బ్యూటీషియన్ నాగదేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా అందరినీ ఎదిరించి ఎనిమిది నెలల కిందట వివాహం చేసుకుని రాజేంద్రనగర్‌ పరిధిలోని హైదర్‌గూడా చైతన్య విల్లాస్ కాలనీ కాపురం పెట్టారు. సాయిశివ బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా భార్య హైదరాబాద్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. తన సోదరి వివాహం కావడంతో సాయి శివ ఊరెళ్లాడు. ఏమైందో ఏమో నాగదేవి భర్తకి ఫోన్ చేసి అర్జంట్‌గా హైదరాబాద్ బయల్దేరి రావాలని అడిగింది. వెంటనే రమ్మని పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

రేపు బయలుదేరుతానని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను అడిగినా భర్త రావడం లేదని ఆవేశానికి గురైన నాగదేవి అఘాయిత్యానికి పాల్పడింది. భర్తకి వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఫ్యాన్‌కి ఉరి వేసుకుంది. కంగారుపడిన భర్త వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారు ఇంటికి వెళ్లి చూసేప్పటికే ఆమె ఫ్యానుకి వేలాడుతూ కనిపించింది. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.