యాప్నగరం

యువతి రొమాంటిక్ కాల్.. రెచ్చిపోయి ఇరుక్కుపోయిన యువకుడు.. కలికాలం!!

ఫేస్‌బుక్ ఫ్రెండ్ వీడియో కాల్ చేయడంతో రెచ్చిపోయాడు. రొమాంటిక్ మాటలతో రెచ్చగొట్టిన ఆమె యువకుడిని కవ్వించి అశ్లీల చిత్రాలను రికార్డ్ చేసింది. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Samayam Telugu 25 Mar 2021, 8:28 pm
స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిపోయి అనర్థాలకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను నమ్మేసి నిండా మునిగిపోతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి నెమ్మదిగా మాటలు కలిపింది. రెండు రోజుల పరిచయంతోనే న్యూడ్ వీడియోలు మాట్లాడుకుందామంటూ బంపరాఫరిచ్చింది. ఎగిరి గంతేసిన యువకుడు అడ్డంగా ఇరుక్కుపోయాడు. అడిగినంతా సమర్పించేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
blackmail


పంజాగుట్టకి చెందిన ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. అది ఓకే చేసిన యువకుడు ఆమెతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. రొమాంటిక్ మాటలతో రెచ్చగొట్టడంతో బుట్టలో పడిపోయాడు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకుందామంటూ ఆమె ఆఫర్ ఇవ్వడంతో ఎగిరి గంతేశాడు. అశ్లీలంగా వీడియో కాల్ చేశాడు. అంతే కథ అడ్డం తిరిగింది. ఆ వీడియోలు రికార్డ్ చేసిన ఆమె అతనితో ఆడుకోవడం మొదలుపెట్టింది.

యువకుడి న్యూడ్ వీడియోలను చూపించి తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని.. లేకుంటే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కి దిగింది. బిత్తరపోయిన యువకుడు రూ.25 వేలు పంపించాడు. అంతటితో ఆగని కిలాడీ లేడీ మరో రూ.50 వేలు కావాలంటూ బెదిరింపులకు దిగడంతో చేసేది లేక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.