యాప్నగరం

Telanganaకు తప్పిన వాయుగుండం.. 19న అల్పపీడనం ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అయితే దీని ప్రభావం తెలంగాణపై అంతగా లేకపోయే సరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాయుగుండం తెలంగాణకు దూరంగా వెళ్లిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 19వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో 19, 20 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Edited byరావు | Samayam Telugu 17 Aug 2022, 8:24 am

ప్రధానాంశాలు:

  • వాయుగుండం ముప్పు నుంచి తెలంగాణ సేఫ్
  • ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం
  • 19వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం
  • అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడే అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Telngana Rains
ప్రతీకాత్మక చిత్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అయితే దీని ప్రభావం తెలంగాణపై అంతగా లేకపోయే సరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాయుగుండం తెలంగాణకు దూరంగా వెళ్లిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ ఈ వాయుగుండం ప్రభావంతో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదుకావడంతో పై నుంచి వరద తెలంగాణకు చేరుకుంటోంది. ఇప్పటికే గోదావరి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండగా.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
వాయుగుండం ముప్పు తప్పిందనుకునే లోపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 19వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. 7న వాయువ్య బంగాళఖాతంలో, 13న ఉత్తర బంగాళాఖాతంలోనూ అల్పపీడనాలు ఏర్పడగా.. మళ్లీ ఆరు రోజుల వ్యవధిలోనే 19న మరో అల్పపీడనం ఏర్పడటం కొంత ఆందోళన కలిగిస్తోంది.

గతంలో ఏర్పడిన రెండు అల్పపీడనాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేదని.. 19వ తేదీన ఏర్పడే అల్పపీడనంతో 19, 20 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.