యాప్నగరం

Banjara Hills: భార్యను పుట్టింటికి పంపించి.. కన్న కూతురిపైనే తండ్రి నీచం

కాపాడాల్సిన తండ్రే కూతురి పాలిట కీచకుడయ్యాడు. కూతురిపై కన్నేసిన కామాంధుడు భార్యను పుట్టింటికి పంపి.. దారుణానికి ఒడిగట్టాడు.. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నోరు మూసి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు..

Samayam Telugu 15 Jan 2022, 5:24 pm
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురి పాలిట కీచకుడయ్యాడు. కూతురిపై కన్నేసిన ఆ కామాంధుడు.. భార్యను పుట్టింటికి పంపించి.. కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. బాధితురాలు తల్లికి ఈ విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.. ఈ దారుణం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని చోటుచేసుకుంది..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పోలీసులు వివరాల మేరకు.. ఓ ఆటో డ్రైవర్ కుటుంబం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటోంది.. వారికి ఓ కూతురు, ఇద్దరు కుమారులు.. అయితే కొన్ని రోజులుగా అతడి భార్య అనారోగ్యంతో ఇబ్బందుల పడుతోంది. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లాలనుకుంది. తనతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లాలని భావించింది.. ఈ క్రమంలోనే భర్తను అడగ్గా దీనికి అంగీకరించలేదు.

పిల్లలను తాను చూసుకుంటానని చెప్పి.. భార్యను పుట్టింటికి పంపించాడు.. అతడి పాడు బుద్ధిని ఊహించని భార్య.. పిల్లలను తీసుకెళ్లకుండానే పుట్టింటికి వెళ్లింది. ఎప్పటిలాగే ఈ నెల 9న రాత్రి ఎప్పటిలాగే ఇంటికి వచ్చాడు. కామంతో ఒంటరిగా నిద్రిస్తున్న కూతురిపై అతడి కన్ను పడింది. ఏ తండ్రి చేయకూడని పని చేశాడు. నిద్రిస్తున్న కూతురి నోరు నొక్కి రెండు సార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.

ఈ క్రమంలోనే బాధితురాలు ఉదయాన్నే జరిగిన విషయాన్ని తన తమ్ముడికి చెప్పింది. వెంటనే వారిద్దరూ కలిసి తల్లి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. విషయం విన్న తల్లి ఒక్కసారిగా షాక్ గురయ్యింది.. వెంటనే తేరుకుని హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పలు సెక్షన్ల కింద కేస్ నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.