యాప్నగరం

హౌసింగ్ లోన్ తిరస్కరించిన బ్యాంక్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఉద్యోగి

ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న రుణాన్ని బ్యాంక్ తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన ప్రైవేట్ ఉద్యోగి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్‌లో జరిగింది

Samayam Telugu 14 May 2021, 9:47 am

ప్రధానాంశాలు:

  • అల్వాల్‌లో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య
  • బ్యాంక్ రుణం తిరస్కరించిందని అఘాయిత్యం
  • విషాదంలో కుటుంబసభ్యులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
ఇంటి రెండో అంతస్తు నిర్మాణానికి బ్యాంకు రుణం మంజూరు కాలేదన్న మనస్తాపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఓల్డ్‌ అల్వాల్‌ సూర్యానగర్‌లోని చేతన్‌ హౌజింగ్‌ సొసైటీలో మాసాని స్వప్న, మాసాని శ్రీనివాస్‌రెడ్డి (40) దంపతులు నివాసముంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన ఇంటికి రెండోఅంతస్తు నిర్మాణం చేయాలని నిర్ణయించుకుని బ్యాంక్ లోన్ కోసం అప్లై చేశాడు.
అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక బ్యాంక్ అతడికి రుణాన్ని తిరస్కరించింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. కుటుంబసభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మామూలు స్థితికి రాలేదు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన భార్య స్వప్న, సోదరుడు, అద్దెకు ఉండే వారి సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే శ్రీనివా‌స్‌రెడ్డి చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.