యాప్నగరం

భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధం.. పెళ్లికూతురికి తెలియడంతో

భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో భర్త మరో పెళ్లి చేసుకోవాలని భావించాడు. సంబంధాలు కూడా చూశాడు. ఓ అమ్మాయితో అతని పెళ్లి కూడా నిశ్చయమైంది. ఈ విషయం మొదటి భార్యకు తెలిసింది.

Samayam Telugu 27 Jul 2021, 10:00 am
భార్య ఉండగానే మరో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నవవధువు బంధువులు అతడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్ పహాడిషరీఫ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావిద్ అనే వ్యక్తి భార్య పురుడు పోసుకునేందుకు పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇదు అదునుగా భావించి జావిద్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. భార్య పుట్టింటికి వెళ్లగానే సంబంధాలు చూసుకోవటం మొదలెట్టాడు. ఈ క్రమంలో హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఒక యువతితో వివాహం ఖాయం చేసుకున్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జులై 25న ఆమెను పెళ్లిచేసుకోటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈసంగతి తెలిసిన మొదటి భార్య కుటుంబీకులు కొత్త పెళ్లి కూతురు కుటుంబానికి జావిద్ సంగతి తెలిపారు. దీంతో జావిద్ అసలు బండారం బయటపడంది. దీంతో కొత్త వధువు బంధువులు జావిద్‌ను ఇంటికి రమ్మని ఆహ్వానించారు. పెళ్లి వారు పిలుస్తున్నారనే ఉత్సాహంతో కొత్త పెళ్లి కూతురు ఇంటికి వెళ్లాడు. దీంతో జావిద్‌ను పట్టుకుని పహాడిషరీఫ్ పోలీస్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.