యాప్నగరం

డిసెంబర్‌లో విడాకులు.. అతడితోనే మళ్లీ పెళ్లి.. భర్త కళ్లెదుటే మాయమైన భార్య

పెళ్లయిన 16ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న ఆ జంట 15 రోజుల క్రితమే మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఐదు రోజుల క్రితం బంధువుల ఇంటికెళ్లి తిరిగి వెళ్తుండగా భార్య కనిపించకుండాపోయింది.

Samayam Telugu 2 Mar 2021, 9:40 am

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ పాతబస్తీలో మహిళ మిస్సింగ్
  • గత డిసెంబర్‌లో విడాకులు తీసుకున్న మహిళ
  • 15 రోజుల క్రితం మళ్లీ అతడితోనే పెళ్లి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu images
వారిద్దరికి 16ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ కలహాలతో గతేడాది డిసెంబర్‌లో విడాకులు తీసుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తెలుసుకుని మళ్లీ వివాహం చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో భార్య సడెన్‌గా కనిపించకుండా పోయింది. దీంతో షాకైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. ఫలక్‌నుమా వట్టేపల్లికి చెందిన మహ్మద్‌ నయీమ్‌‌కు ఫర్జానా బేగం (32)తో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఇద్దరూ పరస్పర అంగీకారం మీద విడాకులు తీసుకున్నారు. అయితే మనసు మార్చుకుని 15 రోజుల క్రితమే మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఐదు రోజుల క్రితం ఇద్దరూ కలిసి బైక్‌పై బండ్లగూడలోని నూరినగర్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో రాత్రి 8 గంటల సమయంలో నౌ నంబర్ చౌరస్తా వద్ద మహ్మద్‌ నయీమ్‌‌ బైక్ ఆపాడు.

అంతే పర్జానా బేగం సడెన్‌గా బైక్ దిగి భర్త చూస్తుండగానే పరుగు తీస్తూ వెళ్లిపోయింది. ఆ ప్రాంతం రద్దీగా ఉండటంతో అతడికి భార్య ఆచూకీ లభించలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీసినా తమ వద్దకు రాలేదని చెప్పారు. దీంతో సోమవారం ఆయన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్జానా కోసం గాలింపు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.