యాప్నగరం

ఓమనీని పెళ్లి చేసుకున్న యువతి.. అత్తారింటికి వెళ్లగానే ట్విస్ట్

Old City: ఆమెను ప్రతిరోజు కుటుంబ సభ్యులు తీవ్ర వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు. భర్త ఒక మానసిక రోగి కావడం వల్ల ఆమె ఉద్యోగం చేయాలంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి చేయడమే కాకుండా వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు.

Samayam Telugu 10 Jan 2021, 2:59 pm
హైదరాబాదులోని ముస్లిం అమ్మాయిలు ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. ఇలాంటి దారుణం మరొకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఫర్హాన్ బేగం (26) అనే అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి ఇద్దరు ఏజెంట్లు వచ్చి ఒక మంచి సంబంధం ఉందని తెలియజేయడంతో వారు ఏజెంట్ల మాటలు నమ్మి ఫర్హాన్ బేగంకు ఒమన్ దేశానికి చెందిన ఓ వ్యక్తితో 2019 నవంబర్ 10వ తేదీన వివాహం జరిపించారు. అయితే పెండ్లి అయిన తర్వాత వీసా కోసం యువతి చాలా రోజులు ఇక్కడే ఉంది.
Samayam Telugu ఓమనీని పెళ్లి చేసుకున్న యువతి.. అత్తారింటికి వెళ్లగానే ట్విస్ట్
contract marriages in hyderabad


వీసా రావడంతో గత నెల 25వ తారీకు ఫర్హాన్ బేగం మస్కట్‌కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్హాన్ బేగంకు తన భర్త ఒక మానసిక రోగి అని తెలిసింది. అంతేకాకుండా ఆమెను ప్రతిరోజు కుటుంబ సభ్యులు తీవ్ర వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు. భర్త ఒక మానసిక రోగి కావడం వల్ల ఆమె ఉద్యోగం చేయాలంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి చేయడమే కాకుండా వేధింపులకు గురి చేస్తూ ఉండేవారు. దీంతో ఫర్హాన్ బేగం అక్కడి పరిస్థితిని తన తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రులు భారతీయ విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్‌కి విజ్ఞప్తి చేశారు. తన కూతుర్ని రక్షించి అక్కడినుండి ఇండియాకు తీసుకుని రావలసిందిగా కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.