యాప్నగరం

ఎయిర్‌పోర్టులో ఎంఐఎం నేత అరెస్ట్

కరోనా సమయంలో ఓ మహిళ చేసిన వీడియోపై ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో ఆయనను అరెస్ట్ చేయాలని దేశ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అప్పట్లో ఆయన దుబాయ్ వెళ్లిపోయారు.

Samayam Telugu 27 Feb 2021, 7:29 am
ఎంఐఎం నేత అబూ ఫైసల్ ను ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సమయంలో ఒక వర్గాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ పెట్టారు. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రజల పైన కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కు చెందిన అబు ఫైసల్ ఓ మహిళను కించపరిచే సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. కరోనా సమయంలో ఈ పోస్టింగ్ వైరల్ అయ్యింది. దీంతో అబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu ఎంఐఎం నేత అబు ఫైసల్


ఇదే సమయంలో ఫైసల్ దేశం విడిచి దుబాయ్‌ వెళ్లపోయారు. దీంతో ఆయన శుక్రవారం హైదరాబాద్ వస్తున్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం మేరకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అబు ఫైసల్ దిగగానే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కరోనా ప్రారంభ దశలో..ఓ వర్గాన్ని కించపరిచేలా, భయబ్రాంతులకు గురిచేసే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు అబూ ఫైసల్ అలియాస్ లతీఫ్ మహమ్మద్. ఇతనిపై గతంలో కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.