యాప్నగరం

Hyderabad Exhibition Society: ఈటలకు చెక్.. మరో కీలక పదవిలో మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ ఏర్పడిన తర్వాత సొసైటీ ఏడేళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పదవికి మంత్రి హరీశ్‌రావు పేరును సొసైటీ పాలకమండలి ప్రతిపాదించింది.

Samayam Telugu 22 Aug 2021, 6:42 am

ప్రధానాంశాలు:

  • ఈటలకు చెక్ పెట్టిన మంత్రి హరీశ్‌రావు
  • ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా నియామకం
  • నియామక పత్రం అందజేసిన పాలకమండలి సభ్యులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu హరీశ్‌రావుకు నియామకపత్రాన్ని అందజేస్తున్న పాలకమండలి సభ్యులు
హైదరాబాద్ ఎగ్జిబిషన్‌ సొసైటీ నూతన అధ్యక్షుడిగా తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు నియమితులయ్యారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ పదవిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కొనసాగుతున్నారు. గత కొద్ది నెలలుగా కొనసాగిన పరిణామాల నేపథ్యంలో ఆయన మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎగ్జిబిషన్ సొసైటీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి మంత్రి హరీశ్‌రావు పేరును సొసైటీ పాలకమండలి ప్రతిపాదించింది.
Also Read: వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లన్నీ వారికే.. తేల్చిచెప్పిన రేవంత్ రెడ్డి

ఈ విషయాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఆయనకు చెప్పడంతో హరీష్‌రావు అంగీకరించారు. దీంతో సొసైటీ ఉపాధ్యక్షుడు వినయ్‌కుమార్‌ ముదిరాజ్‌, కార్యదర్శి ప్రభాశంకర్‌, సంయుక్త కార్యదర్శి జానకీరామ్‌, కోశాధికారి హన్మంత్‌రావు, సభ్యులు ఆదిత్య మార్గం, వనం సురేందర్‌, సురేందర్‌జీ, అశ్విన్‌, చంద్రశేఖర్‌ తదితరులు శనివారం మంత్రిని కలిసి నియామకపత్రం అందజేశారు. త్వరలో సొసైటీ కార్యాలయాన్ని సందర్శిస్తానని, భవిష్యత్తులో నిర్వహించే ఎగ్జిబిషన్‌ దేశానికే తలమానికంగా నిలిచేలా ప్యూహరచన చేద్దామని హరీశ్‌రావు తమతో చెప్పినట్లు సభ్యులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.