యాప్నగరం

హైదరాబాద్ నగరానికి మరో మణిహారం.. బహదూర్‌పురా ఫ్లై ఓవర్

సిగ్నల్ ఫ్రీ హైదరాబాద్ దిశగా నగరం వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం జోరుగా సాగుతోంది. తాజాగా పాతబస్తీలో మరో ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది.

Samayam Telugu 18 Apr 2022, 9:17 pm
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరం సిగలో మరో మణిహారం కొలువుదీరనుంది. పాతబస్తీలో రూ.108 కోట్లతో నిర్మించిన బహదూర్‌పురా ఫ్లైఓవర్ రేపు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ రేపు బహదూర్‌పురా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవెలప్‌మెంట్ ప్రాజెక్ట్(ఎస్ఆర్‌డీపీ) తొలి దశలో చేపట్టిన 47 పనులలో 13 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్‌లు ఇప్పటి వరకూ అందుబాటులోకి వచ్చాయి.
Samayam Telugu flyover
బహదూర్‌పురా ఫ్లై ఓవర్


పాతబస్తీ అభివృద్ధికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం రవాణా, మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే పాతబస్తీలో ఏపీజే అబ్దుల్ కలాం, బైరామల్ గూడ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. రేపటి నుంచి బహదూర్‌పురా ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఆరు లేన్ల బహదూర్‌పురా ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 108 కోట్లు ఖర్చు చేసింది.

కొత్త ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా రవాణా సమయం తగ్గడం, ఇంధన కాలుష్య నియంత్రణ, సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం కలుగుతుంది. ఇరువైపులా సర్వీస్ రోడ్డు, సైడ్ డ్రెయిన్లు కూడా నిర్మించడం విశేషం. ఈ ఫ్లైఓవర్‌తో అరాంఘర్ నుంచి ఉప్పల్ వరకూ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసే వీలు కలుగుతుంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.