యాప్నగరం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం

సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో మంత్రి తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 14 Feb 2021, 2:34 pm
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణ గౌడ్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో శ్రీనివాస్ తండ్రి నారాయణ గౌడ చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. దీంతో శ్రీనివాస్‌గౌడ్‌ను పలువురు టీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, దామోదర్‌ రెడ్డి పరామర్శించారు. శోకసంద్రంలో ఉన్న మంత్రి తల్లిగారిని కవిత ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.