యాప్నగరం

కొవిడ్ ఔషధ కొరత వేళ MSN ల్యాబ్స్ నుంచి కొత్త డ్రగ్

Covid News: ప్రపంచంలోనే అత్యంత అందుబాటు ధరలోని బ్రాండెడ్‌ జెనరిక్‌ ఫావిపిరావిర్‌, ఫావిఫ్లోను గత సంవత్సరం ఆగస్టులో ఎంఎస్‌ఎన్‌ 200 మరియు 400ఎంజీ శక్తితో సంస్థ విడుదల చేసింది.

Samayam Telugu 29 Apr 2021, 3:16 pm
ఓ మోస్తరు నుంచి మధ్యస్థ కోవిడ్‌-19 ఫ్లూ లక్షణాలు కలిగిన రోగుల చికిత్సలో వాడే యాంటీ వైరల్‌ ఔషదం ఫారిపిరావిర్‌ కొరత సమస్యను తీర్చేందుకు ఎంఎస్‌ఎన్‌ లేబరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఓ ఔషధాన్ని విడుదల చేసింది. బుధవారం తమ బ్రాండెడ్‌ జెనరిక్‌ ఫావీలో 800ఎంజీ మాత్రలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యధిక శక్తివంతమైన ఫావీలో 800ఎంజీ ఒక్క మాత్ర ధర రూ.144. ఇది దేశవ్యాప్తంగా అన్ని ఫార్మసీలలో లభ్యం అవుతుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Samayam Telugu MSN Labs
MSN Labs


ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ సీఎండీ డాక్టర్‌ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘భారతదేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసులు గణనీయంగా పెరుగుతున్న వేళ, అందుబాటు ధరలలో చికిత్సావకాశాలు ఇప్పుడు కేసుల సంఖ్యను తగ్గించేందుకు అవసరం. మా ఉత్పత్తి ఫావీలో 800ఎంజీ ఇప్పుడు కోవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడేందుకు దేశం చేస్తున్న ప్రయత్నాలకు తగిన మద్దతునందించగలదనే నమ్మకంతో ఉన్నాం’’ అని అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత అందుబాటు ధరలోని బ్రాండెడ్‌ జెనరిక్‌ ఫావిపిరావిర్‌, ఫావిఫ్లోను గత సంవత్సరం ఆగస్టులో ఎంఎస్‌ఎన్‌ 200 మరియు 400ఎంజీ శక్తితో విడుదల చేసింది. అత్యధిక శక్తితో కూడిన మాత్రలు రోగికి సౌకర్యం అందిస్తాయని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ భరత్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎంఎస్‌ఎన్‌ ఇప్పుడు 1 లక్షకు పైగా మోతాదులను కోవిడ్‌–19 చికిత్స కోసం గత 15 రోజులలో ఉత్పత్తి చేసింది. రాబోయే నెల రోజులలో ఈ సంఖ్యను 6–8 లక్షల మోతాదుకు (ఫావీలో యొక్క విభిన్నమైన స్ట్రెంగ్త్స్‌తో కూడిన 30 లక్షల స్ట్రిప్స్‌) పెంచనున్నాం’’ అని అన్నారు.

దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కోవిడ్‌–19 కేసుల నేపథ్యంలో రెమిడెసివిర్‌, ఓసెల్లామివిర్‌ సహా ఇతర కీలకమైన కోవిడ్‌ సంబంధిత ఔషదాలు లభించడం అనేది అత్యంత సవాలుగా మారింది. కోవిడ్‌ చికిత్స శ్రేణిలో భాగంగా ఇప్పటికే ఎంఎస్‌ఎన్‌ ఒసెల్టామివిర్‌ 75ఎంజీ క్యాప్సూల్స్‌ను విడుదల చేసింది. ఈ యాంటీ వైరల్‌ ఔషదంను ఓసెలో బ్రాండ్‌ పేరిట విడుదల చేసింది. లభ్యత కోసం, దయచేసి ఎంఎస్‌ఎన్‌ కోవిడ్‌ హెల్ప్‌లైన్‌ 91005 91030కు కాల్‌ చేయడం లేదా customercare@msnlabs.com ఈ మెయిల్‌ చేయవచ్చని సంస్థ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.