యాప్నగరం

ఎనిమిదో నిజాం కన్నుమూత.. ఆయన చివరి కోరిక ఏంటంటే.. హైదరాబాద్‌లోనే..

హైదరాబాద్‌ను పాలించిన నిజాం కుటుంబంలో విషాదం నెలకొంది. ఎనిమిదో నిజాం రాజు ముకర్రం జా బహదూర్ మరణించారు. 89 ఏళ్ల వయస్సున్న ముకర్రం జా.. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించినట్టు నిజాం కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన కుటుంబ సభ్యులు ముకర్రం జా భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 16 Jan 2023, 5:33 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌ను పాలించిన నిజాం కుటుంబంలో విషాదం
  • ఎనిమిదో నిజాం ముకర్ర జా బహదూర్ కన్నుమూత
  • 17న ప్రజా సందర్శనార్థం హైదరాబాద్‌లో జా భౌతికకాయం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu nizam
నిజాం
Hyderabad Nizam: హైదరాబాద్‌ను పాలించిన నిజాం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎనిమిదో నిజాం రాజు ముకర్రం జా బహదూర్ అని పిలువబడే మీర్ బర్కెట్ అలీ ఖాన్ మృతి చెందారు. 89 ఏళ్ల వయస్సున్న ముకర్రం జా.. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించినట్టు నిజాం కుటుంబ సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ వారసుడు, మనవడు అయిన జా టర్కీలో నివసిస్తున్నారు. కాగా.. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. కాగా.. ఈ నెల 17వ తేదీన కుటుంబ సభ్యులు ముకర్రం జా భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అవసరమైన ఆచార వ్యవహారాలను పూర్తి చేసిన తర్వాత అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తన స్వదేశంలోనే అంత్యక్రియలు జరగాలన్నది జా చివరి కోరిక అని.. అందుకే ఈ నెల 17న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురావాలని ఆయన పిల్లలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. “హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కెట్ అలీ ఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ గత రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో రాత్రి 10.30 గంటలకు ప్రశాంతంగా మరణించారని మీకు తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాం.” అని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.

1933 అక్టోబర్ 6 న ఫ్రాన్సులో.. ఒట్టోమన్ సామ్రాజ్యపు యువరాజు ఆజం జా, యువరాణి దుర్రు షెహ్వార్‌లకు జా జన్మించారు. ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఏప్రిల్ 6, 1967న ఎనిమిదవ అసఫ్ జాగా పట్టాభిషేకం చేయబడ్డాడు.

HYD: ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. సంక్రాంతి గిఫ్ట్‌గా లగ్జరీ కార్లు
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.