యాప్నగరం

నారాయణ కాలేజీ ఏవో అశోక్ రెడ్డి మృతి.. విషమంగా విద్యార్థి నేత పరిస్థితి

Narayana College: గతనెల 19న రామంతపూర్ నారాయణ కాలేజీలో జరిగిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనలో గాయపడిన ఏవో అశోక్ రెడ్డి.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 4 Sep 2022, 5:32 pm

ప్రధానాంశాలు:

  • రామంతపూర్ నారాయణ కాలేజీ ఏవో అశోక్ రెడ్డి మృతి
  • గత నెల 19న గాయపడిన ఏవో అశోక్ రెడ్డి
  • చికిత్స పొందుతూ DRDO ఆసుపత్రిలో మృతి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ashok Reddy died in DRDO hospital
డీఆర్డీవో ఆసుపత్రిలో అశోక్ రెడ్డి మృతి
Narayana College: ఆగస్టు 19న రామంతపూర్ నారాయణ కాలేజీలో.. ఓ విద్యార్థి నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో గాయపడిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అశోక్ రెడ్డి.. చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. గత కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థి ఫీజుకు సంబంధించిన విషయంపై చర్చించే సమయంలో.. విద్యార్థి నాయకుడు సందీప్ (Sandeep) పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలేజీ ప్రిన్సిపల్ గదిలోని దీపంపై పెట్రోల్ పడి మంటలు అంటుకున్నాయి. అక్కడే ఉన్న ఏవో అశోక్ రెడ్డికి గాయాలయ్యాయి. అప్పటినుంచి కంచన్ బాగ్ DRDO ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. 15 రోజుల చికిత్స తర్వాత అశోక్ రెడ్డి చనిపోయారు.
15 రోజుల క్రితం నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ గదిలోకి సందీప్, మరో విద్యార్థి టీసీ కోసం వెళ్లారు. ఫీజు గురించి మాట్లాడే క్రమంలో.. వాగ్వాదం జరిగింది. దీంతో సందీప్ ఆత్మహ్యత్యాయత్నానికి ప్రయత్నించాడు. తనతో తెచ్చుకున్న పెట్రోల్ (Petrol) బాటిల్ ఓపెన్ చేసి మీద పోసుకున్నాడు. ప్రమాదవశాత్తు పెట్రోల్ గదిలో ఉన్న దీపంపై పడింది. దీంతో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో విద్యార్థి నేత సందీప్, ఏవో అశోక్ రెడ్డి సహా.. ప్రిన్సిపల్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం సందీప్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.