యాప్నగరం

జూపార్క్‌లో కొత్త జంతువులు.. కొమరం భీంగా నామకరణం

నగంలోని జూపార్క్‌లో కొత్త జంతువులు జన్మించాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్తగా పుట్టిన జంతువులుకు జూ అధికారులు నామకరణం చేశారు.

Samayam Telugu 6 Jun 2021, 12:26 pm
హైదరాబాద్ జూపార్కులో కొత్త జంతవులు కనువిందు చేస్తున్నాయి. ఇటీవల జన్మించిన కొత్త ప్రాణులు ఆకట్టుకుంటున్నాయి. శనివారం జూపార్కులో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రెండు కూనలకు నామకరణం చేశారు జూ అధికారులు. 15 రోజుల క్రితం జూలో క్రితం ఖడ్గమృగం జన్మించింది. ఈ నెల 2న అడవి దున్న పిల్ల జన్మించింది. వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన వాటికి శనివారం జరిగిన కార్యక్రమంలో నామకరణం చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అడవి దున్నకు ‘కొమరం భీమ్‌’ అని యోధుడి పేరుపెట్టారు జూ అధికారులు. ఖడ్గమృగానికి ‘నంద’ అని నామకరణం చేశారు. అనంతరం వాటికి కేటాయించిన ఎన్‌క్లోజర్లలో తల్లుల వద్ద వదిలిపెట్టారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు ఆర్‌.శోభ ఆర్‌.ఎం దొబ్రియాల్‌, సిధానంద్‌ కుక్రెట్టి, ఎంజే అక్బర్‌, క్యూరేటర్‌ వీవీఎల్‌ సుభద్రాదేవి, డిప్యూటీ డైరెక్టర్‌ (వెటర్నరీ) డాక్టర్‌ ఎం.ఏ హకీం, డిప్యూటీ క్యూరేటర్‌ ఎ.నాగమణి, పీఆర్‌ఓ హనీఫుల్లా పాల్గొన్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.