యాప్నగరం

అమీర్‌పేటలో కారు దగ్ధం.. నాలుగేళ్లుగా అక్కడే పార్కింగ్, ఘటనపై అనుమానాలు

అమీర్‌పేటలోని ధరంకరం ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ పాత కారు దగ్ధమైంది. ఈ ఘటనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 18 Jan 2021, 8:39 am
హైదరాబాద్ నగరంలో ప్రధాన వాణిజ్య ప్రాంతమైన అమీర్‌పేటలో ఓ కారు దగ్ధం కావడం అందరినీ కలవరపెట్టింది. ధరంకరం రోడ్డులో చాలాకాలంగా ఓ పాత కారు పార్క్ చేసింది. అన్ని రోజులుగా ఆ కారు అక్కడే ఉన్నా స్థానికులు గాని, పోలీసులు గాని దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆ కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Samayam Telugu దగ్ధమవుతున్న కారు


స్థానికులు వెంటనే గమనించి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా కొద్ది క్షణాల్లోనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ఢమైంది. అయితే కారు దానికదే దగ్ధమైందా? లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ కారు ఎవరిది, ఎందుకు అక్కడే వదిలేశారు అన్న దానిపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.