యాప్నగరం

రాజేంద్రనగర్ కాల్ మనీ ఆత్మహత్య కేసులో నలుగురు అరెస్ట్

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఓ యాప్ నిర్వాహకుడి డాటాను కూడా పోలీసులు గుర్తించారు. దీంతో కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

Samayam Telugu 21 Dec 2020, 6:02 pm
కాల్ మనీ వ్యవహారం కలకలం రేపుతోంది. రాజేందర్ నగర్ కాల్ మనీ బాధితుని సూసైడ్ కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాల్ మనీ లోన్ యాప్ ప్రతినిధుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కాల్ మనీ యాప్ వల్ల ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారని పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. కేసు దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. మూడు కమిషనరేట్ పరిధిలో నిన్న ఒక్కరోజే వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి.
Samayam Telugu call money


Read More: కేసీఆర్ ఫాంహౌస్‌లో పంట ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలి: బండి సంజయ్

సైబర్ క్రైం పోలీసులు దీనిపై దర్యాప్తు చేయగా బెంగళూరు, ఢిల్లీ నుండి కాల్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని కాల్స్ చేసి బెదిరిస్తున్న కాల్ సెంటర్లను గుర్తించడానికి బెంగళూరు, ఢిల్లీ, ముంబాయి లకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. హైదరాబాదులో ఒక యాప్ నిర్వాహకుడి డాటాను కూడా పోలీసులు గుర్తించారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కాల్ మనీ యాప్ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.. రాజేంద్రనగర్ బాధితుడి ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.