యాప్నగరం

దేశానికి గ్రామీణ యువతే వెన్నెముక.. ‘ప్రథమ్’ సహ వ్యవస్థాపకుడు మాధవ్ చౌహాన్

అభివృద్ధి చెందుతున్న మన దేశానికి గ్రామీణ ప్రాంతాల యువకులే వెన్నెముక అని ‘ప్రథమ్’ సహ వ్యవస్థాపకుడు మాధవ్ చౌహాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో ప్రథమ్ ధనాని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ‘రూరల్ ఏరియాల్లో యూత్ నెట్ ప్రోగ్రాం అమలు’ అనే అంశంపై రెండ్రోజుల దక్షిణాది రాష్ట్రాల జాతీయ సెమినార్‌‌లో పాల్గొని మాట్లాడారు.

Authored byRaj Kumar | Samayam Telugu 21 Apr 2022, 3:00 pm
దేశంలోని గ్రామాల సమగ్రాభివృద్ధిలో ‘ప్రథమ్’ యూత్ నెట్ కార్యక్రమం ద్వారా గ్రామీణ యువత ప్రమేయం పెరుగుతుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు మాధవ్ చౌహాన్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న మన దేశానికి గ్రామీణ ప్రాంతాల యువకులే వెన్నెముక అని చెప్పారు. హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో ప్రథమ్ ధనాని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ‘రూరల్ ఏరియాల్లో యూత్ నెట్ ప్రోగ్రాం అమలు’ అనే అంశంపై రెండ్రోజుల దక్షిణాది రాష్ట్రాల జాతీయ సెమినార్‌ జరుగుతోంది. అందులో గురువారం మాధవ్ చౌహాన్ పాల్గొని మాట్లాడారు.
Samayam Telugu కార్యక్రమంలో మాట్లాడుతున్న మాధవ్ చౌహాన్



రూరల్ ఏరియాల్లో నాయకత్వ లక్షణాలు కలిగిన యువకుల్ని గుర్తించి వారికి కావాల్సిన విద్య, శిక్షణను అందించాలని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రథమ్ సభ్యులకు ఆయన సూచించారు. దీని ద్వారా వారు గ్రామాలకు వెళ్లి విద్య, స్వచ్ఛత, ఇతర సామాజిక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారన్నారు. కాగా, ప్రథమ్ కార్యక్రమం ద్వారా ఏటా 35 వేల మంది యువకులకు ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, హెల్త్ కేర్, బ్యూటీ, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రథమ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రాజేశ్ థోక్లే, సౌత్ రెజినాల్డ్ మెంటార్ సచిన్ చంద్రోకర్, వివిధ రాష్ట్రాల ప్రథమ్ హెడ్స్ బి. హనుమంత్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.