యాప్నగరం

Vande Bharat: తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు.. ఈ సారి తిరుపతి, బెంగళూరుకు..

Vande Bharat: తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు రానున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఒక వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తులో సికింద్రాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, బెంగళూరు నగరాలకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 17 Jan 2023, 8:35 am

ప్రధానాంశాలు:

  • తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు మధ్య సర్వీసులు
  • రెండో విడతలో అందుబాటులోకి రానున్న మరిన్ని ట్రైన్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vande Bharat express
వందే భారత్ ఎక్స్‌ప్రెస్
Vande Bharat: ఈ నెల 15వ తేదీన తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ ట్రైన్ సర్వీసులు అందిస్తోంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరంలలో ఈ ట్రైన్ ఆగుతుంది. అత్యాధునిక సౌకర్యాలు ఉండే వందే భారత్ రైలును సెమీ హైస్పీడ్ రైలుగా చెబుతున్నారు. కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు చేరుకోవచ్చు.
అయితే తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు వచ్చే అవకాశముంది. రెండో దశలో భాగంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి, బెంగూళూరు మధ్య సర్వీసులు అందించేలా వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి విడతలో భాగంగా దేశంలోని 75 నగరాలను అనుసంధానిస్తున్నామని, ఇది పూర్తైన తర్వాత రెండో దశ ప్రారంభం అవుతుందన్నారు. రెండో దశలో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని నగరాలకు కనెక్ట్ అయ్యేలా వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

త్వరలో సికింద్రాబాద్, విజయవాడ మధ్య ట్రాక్ సామర్థ్యాన్ని 160 కిలోమీటర్లకు పెంచబోతున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌కు సంబంధించి ప్రధాన కార్యాలయం నిర్మిస్తున్నామని, అది పూర్తైన తర్వాత జీఎంను నియమిస్తామని తెలిపారు. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలుతో 30 నగరాలను అనుసంధానం పూర్తయిందని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. త్వరగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం, అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్లే వందే భారత్ ట్రైన్లలో అధిక ఛార్జీలు ఉన్నాయని చెప్పారు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలు భావిస్తున్నారని, వందే భారత్ ట్రైన్ల వల్ల అది సాధ్యమవుతుందని తెలిపారు.

సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ట్రైన్ వల్ల ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు మూడు గంటల్లో, విశాఖపట్నంకు 8.30 గంటల్లో చేరుకోవచ్చు. 1128 సీట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వైఫై సౌకర్యంతో పాటు సీసీ కెమెరాలు, రెస్ట్ రూమ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉండటంతో.. ఛార్జీలు ఎక్కువైనా వందే భారత్ ట్రైన్లలో ప్రయాణించేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.