యాప్నగరం

Rajiv Swagruha: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు లాటరీ.. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌

Hyderabad Rajiv Swagruha Flats: హైదరాబాద్ పరిధిలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపునకు రంగం సిద్ధమైంది. బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్ల కొనుగోలుకు ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లాటరీ ద్వారా కొనుగోలుదారులను ఎంపిక చేయనున్నారు అధికారులు..

Authored byRaj Kumar | Samayam Telugu 27 Jun 2022, 9:35 am
హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇవ్వాళ ఉదయం 9 గంటల నుంచి లాటరీ పద్ధతిలో అధికారులు ఫ్లాట్లు కేటాయించనున్నారు. అయితే లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫ్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వడంతో.. నేటి నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయింపు జ‌ర‌గ‌నుంది.
Samayam Telugu Rajiv swagruha Flats draw


బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కోసం 33,161 దరఖాస్తులు వ‌చ్చాయి. అలాగే పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా బండ్లగూడలోని 345 ట్రిపుల్ బెడ్రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం అత్యధికంగా 16,679 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇవ్వాళ ఉదయం లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో లైవ్‌ స్ట్రీమింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇవ్వాళ పోచారం, మంగళవారం (28న) బండ్లగూడ, బుధవారం (29న) బండ్లగూడ ట్రిపుల్ బెడ్రూం డీలక్స్ ఫ్లాట్ల కోసం డ్రా ప‌ద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అయితే ఈ పూర్తి ప్రక్రియను హెచ్‌ఎండీఏ అధికారులు రికార్డు చేయడ‌మే కాకుండా.. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్‌ మాత్రమే కేటాయిస్తామని అధికారులు వెల్లడించారు. ఇందుకు ప్రాతిపదికగా ఆధార్‌ సంఖ్యను తీసుకోనున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.