యాప్నగరం

హైదరాబాద్: రెచ్చిపోయిన దొంగలు.. జ్యోతిషుని ఇంట్లో లక్షల ఖరీదైన జాతక రాళ్లు చోరీ

నగర శివారుల్లోని ఒంటరిగా ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుంటున్న దొంగలు.. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. రెండు రోజులుగా వరుస దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి.

Samayam Telugu 18 Jun 2021, 9:15 am

ప్రధానాంశాలు:

  • శివారు ప్రాంతాల్లో హల్‌చల్ చేస్తున్న దొంగలు.
  • రెండు రోజుల్లోనే ఎనిమిది చోట్ల చోరీలు.
  • జ్యోతిషుడి నివాసంలో చొరబడ్డ దుండగులు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu హైదరబాద్ చోరీ
Representative Image
హైదరాబాద్‌ నగర శివారుల్లో వరుస చోరీలతో కలకలం రేగుతోంది. బుధవారం రాత్రి హయత్‌నగర్ సూర్యవంశీ కాలనీలోని మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు.. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మూడు షాపులను కొళ్లగొట్టారు. తాజాగా, శివారు ప్రాంతంలోని జ్యోతిషుడి ఇంట్లో దుండగులు భారీ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ న్యూ వెంకటరమణ కాలనీలోని బాల మురళీ కృష్ణ అనే జోతిష్యుని ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇంటిలో ఉన్న రూ.40 లక్షలు విలువజేసే జాతకం (రంగు) రాళ్లను దొంగలు అపహరించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీస్ టీమ్‌లతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మూడు నాలుగు రోజుల కిందటే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి సూర్యవంశీ కాలనీలో రెండు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కరుణాకర్ అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి 10 తులాల బంగారు, 1.5 కిలోల వెండి ఆభరణాలు అపహరించుకుపోయినట్లు బాధితులు తెలిపారు. ఆ ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు.

అనంతరం మోహన్ నాయక్ అనే వ్యక్తి ఇంట్లో చొరబడే ప్రయత్నం చేశారు. వెంటనే అతను ఇతర కాలనీవాసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి దొంగలు పరారైనట్లు తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోనూ మూడు దుకాణాల షెటర్లని ధ్వంసం చేసి దుండగులు చోరీకి యత్నించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.