యాప్నగరం

సికింద్రాబాద్ అల్లర్లు: పెద్ద ప్రమాదమే తప్పింది.. పవర్ కార్‌కు నిప్పు అంటుకొనుంటే!

Agnipath Protest in Hyderabad: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న విధ్వంసకాండలో రూ. 12 కోట్ల నష్టం వాటిల్లినట్లు డీఎం గుప్తా తెలిపారు. పవర్ కార్‌కు మంటలు అంటుకొని ఉంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని, భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించేదని ఆయన అన్నారు. సికింద్రాబాద్ అల్లర్ల ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని డీఎం గుప్తా తెలిపారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 18 Jun 2022, 10:00 pm
గ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద చేపట్టిన ఆందోళనలో జరిగిన విధ్వంసంలో 5 రైలు ఇంజిన్లు (లోకో మోటార్స్), 30 రైలు బోగీలు, పార్శిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయినట్లు సికింద్రాబాద్‌ రైల్వే రీజినల్ మేనేజర్‌ గుప్తా తెలిపారు. నిప్పు పెట్టిన బోగీల్లో ప్రయాణికుల సామగ్రి పూర్తిగా ధ్వంసమైందని ఆయన తెలిపారు. పవర్ కార్ (డీజిల్ ట్యాంకర్)కు భారీ ప్రమాదం తప్పిందని గుప్తా చెప్పారు. ఒకవేళ పవర్ కార్‌కు మంటలు అంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదన్నారు. ఆందోళనకారులను సకాలంలో అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అన్నారు.
Samayam Telugu సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
Secunderabad Railway Station Violence


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లలో ప్రత్యక్ష్యంగా 12 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని డీఎం గుప్తా తెలిపారు. అల్లర్ల అనంతరం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసిన కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. అన్ని ప్యాసింజర్, గూడ్స్ రైళ్లను పునరుద్ధరించామని డీఎం గుప్తా చెప్పారు. అల్లర్ల ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని ఆయన తెలిపారు. శనివారం (జూన్ 18) ఉదయం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

మరోవైపు.. అగ్నిపథ్ నిరసన ముసుగులో కొంత మంది చోరీలకు పాల్పడ్డారు. బిహార్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రూ.3 లక్షల నగదును ఆందోళనకారులు ఎత్తుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.