యాప్నగరం

Shamshabad: పైకి సూట్‌కేస్ కవరింగ్.. లోపల రూ.41 కోట్ల విలువైన సరుకు.. నిజంగా కిలేడినే!

Heroin seized: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీ మెుత్తంలో హెరాయిన్ పట్టుకున్నారు. మలావీ నుంచి దోహా మీదుగా హైదరాబాద్ తరలిస్తున్న హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ. 41 కోట్లుగా అధికారులు వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 9 May 2023, 11:06 am

ప్రధానాంశాలు:

  • శంషాబాద్‌లో భారీగా హెరాయిన్ పట్టివేత
  • రూ.41 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
  • సూట్‌కేస్‌లో స్మగ్లింగ్ చేస్తున్న మహిళ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Heroin seized
హెరాయిన్ పట్టివేత
RGI Airport hyderabad: హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. 41 కోట్ల విలువచేసే హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు కొత్త మార్గాలు ఎంచుకుంటున్న స్మగ్ల్రరు.. ఎవరికి అనుమానం రాకుండా వివిధ దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. తాజాగా.. ఓ మహిళ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. దోహా నుంచి హైదరాబాద్ చేరుకున్న ఓ ప్రయాణికురాలు ఈనెల 7న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగింది. చేతిలో సూట్‌కేస్‌తో బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది.
అయితే ఆమె ప్రవర్తనపై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులకు అనుమానం వచ్చింది. సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. సూట్‌కేసు అడుగుభాగంలో ఎవరికి అనుమానం రాకుండా ఫౌడర్ రూపంలో హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పైకి సూట్‌కేసు కవరింగ్ ఇస్తూ.. లోపల మాత్రం కోట్ల విలువైన హైరాయిన్‌ను స్మగ్లింగ్ చేసింది. మలావీ నుంచి హెరాయిన్ తీసుకొస్తున్నట్లు నిందితురాలు ఒప్పుకుంది.

పట్టుబడిన 5.9 కేజీల హెరాయిన్ సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు స్పష్టం చేశారు. దాని విలువ మార్కెట్‌లో 41.3 కోట్లు ఉంటుందని చెప్పారు. నిందితురాలిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. హెరాయిన్ ఎక్కడికి తరలిస్తున్నది.. ఎవరికి సరఫరా చేస్తున్నారనే అంశంపై ఆరా తీస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు మీడియాకు వెల్లడించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.