యాప్నగరం

ఇది కేటీఆర్ నిజమైన ఫోటో అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. అసలు కథ ఏంటంటే..

Pragathi Bhavan: తనకు ఇంత మంచి కానుక ఇచ్చినందుకు కేటీఆర్ ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు. అయితే, గత సెప్టెంబర్‌లో కూడా తన తండ్రి కేసీఆర్‌తో కేటీఆర్‌ కలిసిఉన్న చిత్రపటాన్ని వరుణ్‌ అందజేశారు.

Samayam Telugu 12 Jan 2021, 7:19 pm
కేటీఆర్‌ చిత్రపటానికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే, ఇది ఫోటో కాదు.. కానీ, అచ్చం ఫోటో మాదిరిగానే ఉండడం విశేషం. ఓ చిత్రకారుడు కేటీఆర్ తన పిల్లలతో ఉన్న సన్నివేశాన్ని తన కుంచెతో తెరపైకి ఎక్కించారు. దీన్ని చూసిన వారంతా నిజమైన ఫోటో అని భ్రమ పడుతున్నారు. సోషల్‌ మీడియాలో పోరాటకారుడైన తక్కళ్లపల్లి వరుణ్‌ అనే వ్యక్తి తాను వేసిన ఈ చిత్రపటాన్ని సోమవారం ప్రగతి భవన్‌‌లో మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
Samayam Telugu పెయింటింగ్
ktr


తన కుమారుడు హిమాన్షు రావు, కుమార్తె అలేఖ్య రావుతో చిన్నవయసులో ఉన్నప్పుడు వారితో కలిసి ఉన్న చిత్ర పటాన్ని అత్యంత సహజంగా వేసిన వరుణ్‌‌ను కేటీఆర్‌ ఈ సందర్భంగా అభినందించారు. సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం కేటీఆర్‌ తన పిల్లలిద్దరితో కలిసి షాపింగ్‌కు వెళ్లిన ఫొటోను చూసి వరుణ్‌ ఈ చిత్రాన్ని గీశారు. ఈ చిత్రాన్ని చూసి మురిసిపోయిన కేటీఆర్‌ అప్యాయంగా వరుణ్‌ను హత్తుకుని అభినందనలు తెలిపారు.

takkallapalli varun paint


తనకు ఇంత మంచి కానుక ఇచ్చినందుకు కేటీఆర్ ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు. అయితే, గత సెప్టెంబర్‌లో కూడా తన తండ్రి కేసీఆర్‌తో కేటీఆర్‌ కలిసిఉన్న చిత్రపటాన్ని వరుణ్‌ అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.