యాప్నగరం

హైదరాబాద్ మేయర్‌ ఎన్నికకు మేం కూడా పోటీ చేస్తాం: బీజేపీ

Hyderabad Mayor: మేయర్‌ ఎన్నికలో గెలుపు, ఓటమితో తమకు సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. ఈ ఎన్నికలో మజ్లిస్‌ పార్టీ పోటీ పడుతుందో లేదో తెలియదని అన్నారు. అది ఆ పార్టీ వ్యక్తిగత వ్యవహారమని అన్నారు.

Samayam Telugu 9 Feb 2021, 10:02 pm
జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో తాము కూడా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు స్పష్టం చేశారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులను తమ పార్టీ తరపున కూడా నిలబెడతామని చెప్పారు. బీజేపీకి మేయర్ పదవి ఇవ్వాలనే నగర ప్రజలు 48 స్థానాల్లో విజయం కట్టబెట్టారని గుర్తు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్యకొన్ని వేల ఓట్ల తేడా మాత్రమే ఉందని అన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bjp


మేయర్‌ ఎన్నికలో గెలుపు, ఓటమితో తమకు సంబంధం లేదని అన్నారు. ఈ ఎన్నికలో మజ్లిస్‌ పార్టీ పోటీ పడుతుందో లేదో తెలియదని అన్నారు. అది ఆ పార్టీ వ్యక్తిగత వ్యవహారమని అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రామచందర్‌రావు ఆరోపించారు. అయితే, టీఆర్ఎస్, ఏఐఎంఐఎంకు మధ్య స్నేహం ఉందని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.