యాప్నగరం

TS Assembly: నేడు క్యాబినెట్ సమావేశం.. అసెంబ్లీ వ్యూహాలపై భేటీ!

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో వ్యూహాలపై ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 6వ తేదీ ఉదయం 11:30 గంటలకు ఇరు సభలు ప్రారంభమై 15వ తేదీ ముగుస్తాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు.

Edited byరావు | Samayam Telugu 3 Sep 2022, 9:47 am

ప్రధానాంశాలు:

  • ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
  • అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం
  • 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu CM KCR
సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో వ్యూహాలపై ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 6వ తేదీ ఉదయం 11:30 గంటలకు ఇరు సభలు ప్రారంభమై 15వ తేదీ ముగుస్తాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ, పోడు భూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ వైఖరిపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. మహిళా యూనివర్సిటీ, సాగునీటి పారుదల రంగానికి చెందిన అంశాలు, ఉద్యోగుల డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా విపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఈ సమావేశాల్లో కచ్చితంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రసవత్తర చర్చ కూడా జరగొచ్చు.. ఈ క్రమంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీని కూడా ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై టీఆర్ఎస్ పార్టీ ఇవాళ వ్యూహం రచించే అవకాశం కనిపిస్తుంది.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.