యాప్నగరం

Telangana Express: తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించే భావోద్వేగం

Telangana Express: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. 46 ఏళ్లు పూర్తి చేసుకుంది. 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. రైల్వే అధికారులు కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఢిల్లీ వెళ్లే రైలును పూలతో అలంకరించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 4 Oct 2022, 5:29 pm

ప్రధానాంశాలు:

  • 46 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్
  • ఢిల్లీ వెళ్లే రైలును పూలతో అలంకరించిన సిబ్బంది
  • కేక్ కట్ చేసి వేడుకలు చేసిన రైల్వే అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Railway staff in front of Telangana Express
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ముందు రైల్వే సిబ్బంది
Telangana Express: తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించే భావోద్వేగం. అలాంటి రైలు.. 46 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రైలును రైల్వే సిబ్బంది అందంగా అలంకరించారు. కేక్ కట్‌ చేసి.. వేడుకలు జరుపుకున్నారు. ఈ రైలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) నుంచి బయలుదేరి.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా.. ప్రయాణించి దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకుంటుంది. సుదీర్ఘంగా 27 గంటల పాటు ప్రయాణించి.. తన గమ్య స్థానాన్ని చేరుకుంటుంది.
ఈ రైలును 1976లో అప్పటి రైల్వే మంత్రి మధు దండావతే ప్రారంభించారు. అప్పుడు దీనికి ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ (Andhra Pradesh Express) అని పేరు పెట్టారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత పేరు మార్చారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. ఈ రైలు ప్రారంభం అయినప్పుడు 14 బోగీలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్యను పెంచారు. ప్రస్తుతం 7 ఏసీ బోగీలతో సహా మొత్తం 24 బోగీలతో ఈ రైలు నడుస్తోంది. దీని సేవలు ప్రారంభం అయినప్పటి నుంచి 1990 వరకు కేవలం ఝాన్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, నాగ్ పూర్, బల్లార్షా, కాజీపేట (Kazipet) స్టేషన్లలో మాత్రమే ఆగేది. ఆ తర్వాత మరికొన్ని స్టేషన్లలో ఆగేలా అనుమతినిచ్చారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.