యాప్నగరం

Hyd మహిళలకు TSRTC గుడ్ న్యూస్.. డ్రైవర్లు తప్పకుండా పాటించాల్సిందే..

Hyderabad: మహిళా ప్రయాణికులు కేవలం బస్‌ స్టాపుల్లోనే కాకుండా తమకు ఇష్టమైన చోట దిగే వెసులుబాటును కల్పించారు. బస్సు డ్రైవర్లు ఈ నిబంధనను తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Samayam Telugu 6 Jul 2021, 8:16 pm
హైదరాబాదీ మహిళలకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇకపై హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సులను మహిళల కోసం రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆపాలని నిర్ణయించింది. బస్‌ స్టాపునకు తమ పని ప్రదేశానికి మధ్య దూరం ఎక్కువగా ఉంటే రాత్రి వేళ వర్కింగ్ మహిళలకు ఇబ్బంది తలెత్తుతుంటుంది. దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి టీఎస్‌ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి 7.30 దాటిన తర్వాత మహిళలు చెయ్యి ఎత్తిన చోట బస్సు ఆగేలా, అలాగే వారు కోరుకున్న చోట దిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
hyd city buses


ఆపకపోతే ఫిర్యాదు
ఈ క్రమంలోనే మహిళా ప్రయాణికులు కేవలం బస్‌ స్టాపుల్లోనే కాకుండా తమకు ఇష్టమైన చోట దిగే వెసులుబాటును కల్పించారు. బస్సు డ్రైవర్లు ఈ నిబంధనను తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ కొత్త విధానాన్ని ఆర్టీసీ మంగళవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చేసింది. ఒకవేళ మహిళా ప్రయాణికులు తాము కోరుకున్న చోట బస్సు ఆపకపోతే వెంటనే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు.

ఈ విషయంపై ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు నగరంలోని 29 డిపోలకు చెందిన మేనేజర్లను ఆదేశించారు. మహిళలు ఎక్కువ సమయం బస్టాపుల్లోనే వేచి ఉండకుండా.. బస్సు కోసం ప్రత్యేకంగా బస్టాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అవకావం కల్పించినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విధానం అమల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 99592 26160, 9959226154 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు. దీంతోపాటు.. ముఖ్యమైన బస్టాపుల్లో రాత్రి 10 గంటల వరకు బస్సుల నియంత్రణ అధికారులుండేలా చర్యలు తీసుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.