యాప్నగరం

Gym Trainer Murder: హైదరాబాద్‌లో ఘోరం.. ప్రియుడి మోజులో జిమ్‌ట్రైనర్‌ను సజీవదహనం.. భార్య ప్లాన్ బట్టబయలు

Gym Trainer Murder: కూకట్‌పల్లి పరిధిలోని జగద్గిరిగుట్టలో జిమ్ ట్రైనర్ జయకృష్ణ మృతి కేసులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో అతడు సజీవదహనం అయినట్లు తొలుత అందరూ అనుకున్నారు. కానీ పోలీసుల విచారణతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కట్టుకున్న భార్యనే భర్తను అతి దారుణంగా హత్య చేసినట్లు తేలింది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 19 May 2023, 12:37 pm

ప్రధానాంశాలు:

  • జియ్ ట్రైనర్ జయకృష్ణ మృతి కేసులో వీడిన మిస్టరీ
  • భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసినట్లు గుర్తింపు
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Gym Trainer Murder: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. భర్తకు మద్యం తాగించిన భార్య.. అతడు మత్తులో ఉండగా పెట్రోల్ పోసి సజీవదహనం చేసింది. నగరంలోని కూకట్‌పల్లి పరిధిలోని జగద్గిరిగుట్టలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జగద్గిరిగుట్ట జిమ్ ట్రైనర్ జయకృష్ణ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కట్టుకున్న భార్యనే జయకృష్ణను చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. జయకృష్ణ భార్య దుర్గా గత కొంతకాలంగా చిన్నా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో జయకృష్ణను హత మార్చాలని ప్రియుడు చిన్నాతో కలిసి పథక రచన చేసింది. ఈ పథకంలో భాగంగా భర్తకు మద్యం తాగించింది.

భర్త మద్యం మత్తులో ఉండగా అతడిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసింది. అనంతరం భర్త మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేసింది. అప్పుల బాధతో జయకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించే విధంగా చిత్రీకరించింది. జయకృష్ణ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుందనే సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సమయంలో జయకృష్ణ మృతదేహాం కనిపించడంతో పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అనుమానంతో జిమ్ ట్రైనర్ భార్య దుర్గతో పాటు ప్రియుడు చిన్నాని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీంతో దర్యాప్తులో భర్తను భర్య చంపినట్లు బయటపడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి చిన్నాతో కలిసి హత్య చేసినట్లు పోలీసుల ముందు దుర్గ నేరం ఒప్పుకుంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వారిద్దరికి కోర్టు రిమాండ్ విధించింది.


  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.