యాప్నగరం

దొంగలకు ‘పండగొచ్చింది’.. సంక్రాంతి స్పెషల్ చోరీలు.. పోలీసుల కీలక సూచనలు!

సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతున్నారు.

Samayam Telugu 12 Jan 2021, 11:45 am
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తమ సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కార్లు బారులు తీరాయి. పండుగ జరుపుకోవడం కోసం జనం స్వగ్రామాలకు వెళ్తుండటం దొంగలకు వరంలా మారుతోంది. పగటి పూట రెక్కీ నిర్వహించి.. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో చొరబడి దోచుకుంటున్నారు.
Samayam Telugu robbery representative
Representative image


మేడ్చల్‌లో ఒకే రోజు ఆరు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. మేడ్చల్ పీఎస్ పరిధిలోని సూర్యానగర్ కాలనీలో ఈ చోరీలు జరిగాయి. దీంతో స్థానికంగా కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.

పండు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పండుగ కోసం ఊరెళ్లేవారు బంగారం, డబ్బులను తమ వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. శిక్షలు విధించినా కూడా దొంగల ఆగడాలు మాత్రం ఆగడంలేదన్నారు. ఇళ్లకు తాళం వేసి పండుగ కోసం సొంతూరు వెళ్లేవారు.. స్థానికంగా ఉండే పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. అలా చేయడం వల్ల రోజులో రెండు మూడుసార్లు పెట్రోలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. అపార్ట్‌మెంట్ వాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.