యాప్నగరం

Times Home Hunt Expo: హైదరాబాద్‌లో సొంత ఇల్లు మీ కలా..? ఈ అవకాశం మీ కోసమే

హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? ఎక్కడ కొనుగోలు చేయాలి..? ఎవరిని కలవాలి..? బ్యాంకు లోన్లు ఎలా తీసుకోవాలనే విషయంలో కన్ఫ్యూజన్‌కు లోనవుతున్నారా..? అయితే మీ అనుమానాలను నివృతి చేసుకోవడానికి సరైన వేదిక టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్‌పో. జూన్ 10, 11 తేదీల్లో హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ ఎక్స్‌పో జరుగనుంది. 36 మంది బిల్డర్స్, 100కి పైగా ప్రాజెక్టులు భాగస్వామ్యం కానున్న ఈ ఈవెంట్‌లో పాల్గొని అవకాశాలను ఒడిసి పట్టుకోండి.

Authored byరవి కుమార్ | Samayam Telugu 3 Jun 2023, 3:06 pm
ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో.. గ్రీన్ మార్క్ డెవలపర్స్ సమర్పించు 'టైమ్స్ హోమ్ హంట్‌ ఎక్స్‌పో ' (Times Home Hunt Expo)కు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. బ్యాంకింగ్ పార్టనర్‌గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాధే కన్‌స్ట్రక్షన్స్ స్పాన్సర్స్‌‌గా వ్యవహరిస్తోన్న ఈ ఎక్స్‌పో.. జూన్ 10, 11 తేదీల్లో (శని, ఆదివారాల్లో) హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్-3లో జరగనుంది. 36 మంది బిల్డర్స్, 100కిపైగా ప్రాజెక్టులు భాగస్వామ్యం కానున్న ఈ ఈవెంట్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది.
Samayam Telugu Times Home Hunt Expo
Times Home Hunt Expo


అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లకు సంబంధించిన స్టాల్స్‌‌ ఈ ఎక్స్‌పోలో అందుబాటులో ఉంటాయి. ఈ Expoకు ప్రవేశం పూర్తిగా ఉచితం. వాహనాల కోసం వాలెట్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. హైదరాబాద్‌ నగరంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలని అనుకుంటున్న వారు.. హౌసింగ్‌ లోన్‌తోపాటు ప్లాట్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు సంబంధించిన అనుమానాలను నివృతి చేసుకోవడానికి 'టైమ్స్ హోమ్ హంట్‌ ఎక్స్‌పో' మంచి అవకాశం. మరిన్ని వివరాల కోసం 8328034997 నంబర్‌ను సంప్రదించగలరు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.