యాప్నగరం

Drunk Policeman: ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం.. ఫ్రెండ్స్‌తో ఫుల్లుగా మందు కొట్టి..

Drunk Policeman: హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో నడి రోడ్డు మీద హల్చల్ చేస్తూ.. వార్తల్లో నిలిచారు. అక్కడితో ఆగకుండా.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులపై కర్రలతో దాడి చేసి.. వాళ్లు ఆస్పత్రి పాలయ్యేలా చేశాడు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మందుబాబులను కంట్రోల్ చేసే ట్రాఫిక్ పోలీసే.. ఇలా చేయటం విమర్శలకు తావిస్తోంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 4 Oct 2022, 10:43 pm
Drunk Policeman: హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో మందుబాబులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. పీకలా దాకా మద్యం సేవించి.. రోడ్డు మీదికొచ్చి రచ్చ రచ్చ చేస్తున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి మందుబాబులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు (Hyderabad Police) నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు.. పోలీసుల మీదికే రెచ్చిపోయి నానా హంగామా చేస్తుంటారు. కానీ.. ఈసారి మాత్రం ఓ ట్రాఫిక్ పోలీసే (Traffic constable).. మందుబాబు అవతారం ఎత్తాడు. ఫుల్‌గా మద్యం సేవించి రోడ్డుపై గోలగోల చేస్తుంటే.. మళ్లీ అదే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu traffic police
ట్రాఫిక్ కానిస్టేబుల్


ఖైరతాబాద్‌లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. బి. శ్రీనివాస్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా సైపాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించాడు. మత్తు ఎక్కిన తర్వాత.. ఖైరతాబాద్ ఐమాక్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయం దగ్గరికొచ్చి హల్చల్ చేశాడు. నానా హంగామా సృష్టించాడు. అక్కడితో ఆగకుండా.. రోడ్డు మీదికొచ్చి ద్విచక్రవాహనం మీద వెళ్తున్న యువకులను ఆపాడు. వాళ్లపై దాడి చేశాడు. ఆ యువకులే తప్పు చేశారంటూ వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయాలైన యువకులు ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బాధిత బంధువులు వెంటనే కానిస్టేబుల్‌పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో పాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.