యాప్నగరం

గవర్నర్ తమిళిసై స్కందగిరి ఆలయ పర్యటనలో విషాదం

తెలంగాణ గవర్నర్ తమిళిసై గురువారం స్కందగిరి ఆలయ పర్యటనలో విషాదం నెలకొంది. గుండెపోటుతో గవర్నర్ వ్యక్తిగత సిబ్బంది రాజు ప్రాణాలు కోల్పోయాడు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 21 Apr 2022, 6:28 pm

ప్రధానాంశాలు:

  • స్కందగిరి ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ తమిళిసై
  • వ్యక్తిగత భద్రతా సిబ్బంది రాజుకు గుండెపోటు
  • గాంధీ ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని స్కందగిరి ఆలయాన్ని సందర్శించారు. దేవాలయంలో విగ్రహ పున: ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞ హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్న గవర్నర్ సుబ్రమణ్య స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే కార్యక్రమం సజావుగా సాగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది.
ఇంట్రస్టింగ్ సీన్.. ఒకే కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
గవర్నర్ అటెండర్ రాజు ఆలయంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన గవర్నర్ భద్రతా సిబ్బంది... రాజును గవర్నర్ కాన్వాయ్‌ వాహనంలోనే హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే అతడిని పరీక్షించిన గాంధీ డాక్టర్లు రాజు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో గవర్నర్‌ తమిళిసై సహా రాజ్‌భవన్‌ అధికారులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి నుంచి రాజ్‌భవన్‌కు తరలించారు. రాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రాజు మరణంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.