యాప్నగరం

అభివృద్దిని చూడలేని వారు ప్రజలను మభ్యపెడుతున్నారు: మంత్రి సింగిరెడ్డి

singireddy niranjan reddy: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. వరసబెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం కారణంగా.. పరోక్షంగా రిజర్వేషన్ల ద్వారా కలగాల్సిన లబ్ధి కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కారణంగా.. రాష్ట్రంలోని ఒక్కో సామాజికవర్గం బలపడుతోందని వివరించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన.. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు-రిజిస్టర్ కులసంఘాల నేతలతో జరిగిన సమావేశంలో మంత్రి సింగిరెడ్డి మాట్లాడారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 8 Sep 2022, 5:11 pm

ప్రధానాంశాలు:

  • కేంద్ర ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఘాటు విమర్శలు
  • వరసబెట్టి ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపణ
  • రాష్ట్రంలో పాడిపంటలు స్వాగతం పలుకుతున్నాయని వ్యాఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Minister Niranjan Reddy speaking in the meeting
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి
singireddy niranjan reddy: తెలంగాణ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కారణంగా.. రాష్ట్రంలోని ఒక్కో సామాజికవర్గం బలపడుతోందని.. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించిందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయని చెప్పారు. తెలంగాణలోని మార్పును చూడలేని వారు.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మర్రి చెన్నారెడ్డి (Marri Chennareddy) మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన.. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాలు-రిజిస్టర్ కులసంఘాల నేతలతో జరిగిన సమావేశంలో మంత్రి సింగిరెడ్డి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా పాడిపంటలు స్వాగతం పలుకుతున్నాయని.. మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. ప్రతి ఏటా ఉపాధి అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలో మంచినీటి చేపల ఉత్పత్తిలో.. తెలంగాణ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. చేపలు (Telangana Fish) ముదిరాజ్ సామాజికవర్గాలకు కల్పించే ఉపాధి మాత్రమే కాదని... అత్యంత ఆరోగ్యంగా భవిష్యత్ తరాలు ఎదగడానికి దోహదపడతాయని వివరించారు. ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే.. వచ్చిన మార్పులకు తెలంగాణ నిదర్శమన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) ఘాటు విమర్శలు చేశారు. వరసబెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం కారణంగా.. పరోక్షంగా రిజర్వేషన్ల ద్వారా కలగాల్సిన లబ్ధి కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. యువత ఉపాధికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కొత్త ఉద్యోగాలు సృష్టించడం వదిలేసిందని ఆరోపించారు. ఖాళీగా ఉన్న 14.50 లక్షల ఉద్యోగాలను భర్తీచేయడం లేదన్నారు. నష్టపోతున్న వర్గాలపై సమాజంలో చర్చ జరగాలని మంత్రి ఆకాంక్షించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.