యాప్నగరం

3 గంటల్లో మూడున్న కోట్ల లిక్కర్.. వామ్మో! ఒకే షాపులో ఉఫ్‌ఫ్‌మన్న మందుబాబులు

Jubilee Hills: మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలైన మందు అమ్మకాల జోరు సాయంత్రం వరకూ కొనసాగింది. అయితే, హైదరాబాద్‌లోని ఓ షాపులో అమ్ముడైన సరకు మొత్తం విలువ మాత్రం విస్మయం కలిగిస్తోంది.

Samayam Telugu 11 May 2021, 11:33 pm

ప్రధానాంశాలు:

  • ఒకే షాపులో 3.5 కోట్ల మద్యం అమ్మకం
  • లాక్ డౌన్ ప్రకటించగానే మందుబాబుల ఆరాటం
  • అన్ని షాపుల వద్ద ఇదే రద్దీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu వైన్ షాపుల ముందు పరిస్థితి
wine shop in jubilee hills
తెలంగాణలో మంగళవారం మధ్యాహ్నం నుంచి రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి. బుధవారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే మందుబాబులు వైన్ షాపుల ముందు బారులు తీరారు. కొన్ని చోట్ల కిలో మీటర్ల కొద్దీ క్యూలు కట్టారు. గతంలో లాక్‌ డౌన్‌‌లో మాదిరిగా రోజుల తరబడి మద్యం దొరకతేమో అని భావించిన మద్యం ప్రియులు చేతికందినన్ని బాటిళ్లను కొనుక్కొని భద్రపర్చుకున్నారు. కరోనా కోరలు చాస్తున్న వేళ దాన్ని లెక్క చేయకుండా కనీసం భౌతిక దూరం పాటించకుండా ఎగబడి మద్యం కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలైన మందు అమ్మకాల జోరు సాయంత్రం వరకూ కొనసాగింది. అయితే, హైదరాబాద్‌లోని ఓ షాపులో అమ్ముడైన సరకు మొత్తం విలువ మాత్రం విస్మయం కలిగిస్తోంది. జూబ్లీహిల్స్‌లోని ఒక మద్యం షాపులో కేవలం 3 గంటల వ్యవధిలోనే రూ.3.5 కోట్ల విలువైన మద్యం అమ్మకం జరిగింది. ఒక షాపులో ఇంత తక్కువ సమయంలో ఇంత అధిక మొత్తం అమ్ముడవడం ఇదే ఆల్‌ టైమ్ రికార్డు అని అధికారులు చెబుతున్నారు.

undefinedమే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్ని రకాల షాపులు తెరిచి ఉండనున్నాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉండనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.