యాప్నగరం

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద వివాహిత ఆత్మహత్య

మృతి చెందిన మహిళ తుక్కుగుడా ప్రాంతవాసిగా గుర్తించారు. పది అంతస్థుల భవనం నుంచి ఆమె దూకి ప్రాణాలు తీసుకుంది. అయితే ఆమె మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 22 Feb 2021, 10:52 am
కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. నిన్న రాత్రి ఓ మహిళ ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీనివాస్ నగర్ కాలనీ , నాగారంలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న డబుల్ బెడ్ రూం పది అంతస్తుల భవనం నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమ్మిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu వివాహిత ఆత్మహత్య


ఆత్మహత్య చేసుకున్న మహిళ కె. సత్య సంతోషిణిగా గుర్తించారు. ఆమె వయసు 27 సంవత్సరాలు. భర్త పవన్ భగవాన్ . వీరు తుక్కుగుడా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వీరికి పెళ్లై మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా సంతానం కలగలేదు. దీంతో మనస్తాపంతోనే.. భార్య భర్త ల మధ్య మనస్పర్థాలు ఏర్పడి మహిళ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణకు వచ్చారు. అయితే ఆత్మహత్య కు గల కారణాల విషయంలో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభినట్లు స్థానిక సి ఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.