యాప్నగరం

Hyderabad Metroపై దావా.... రూ.1.7 కోట్ల పరిహారం కోరుతున్న మహిళ

హైదరాబాద్‌ మెట్రో కారణంగా తన జీవితం నాశనమైందని, కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందంటూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. తనకు రూ.1.7కోట్ల పరిహారం ఇప్పించాలని వేడుకుంటోంది.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 18 Sep 2022, 12:09 pm
మెట్రో రైల్ యాజమాన్యం నుంచి తనకు రూ.1.7 కోట్ల పరిహారం ఇప్పించాలంటూ ఓ మహిళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. మెట్రో పనుల సందర్భంగా జరిగిన ప్రమాదంలో తన తలకు తీవ్రగాయం కావడంతో ఆరోగ్యపరంగా, ఆర్థికంగానూ దెబ్బతిన్నానని, ఇందుకు మెట్రో యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఉజ్మా హఫీజ్‌ హైకోర్టును ఆశ్రయించారు.
Samayam Telugu Hyderbad Metro Rail


పిటిషన్ కథనం ప్రకారం... ఉజ్మా హఫీజ్ 2017లో తన భర్తతో కలిసి వెళుతుండగా నాంపల్లి వద్ద ఇనుప కడ్డీ తలపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమె నెలరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. కోలుకుని డిశ్ఛార్జి అయ్యాక ఫిట్స్, మతిమరపు, దృష్టి లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. తనకు జరిగిన ఘటనను వివరిస్తూ పరిహారం ఇవ్వాలని హైదరాబాద్‌ మెట్రో లేఖ రాయగా.. అది తమ బాధ్యత కాదని.. నిర్మాణ పనులు చూసిన ఎల్ అండ్ టీ సంస్థతో తేల్చుకోవాలని సమాధానం ఇచ్చారు.

దీంతో ఉజ్మా తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తన వైద్య ఖర్చులతో కుటుంబం అప్పుల పాలైందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమకున్న విచక్షణాధికారంతో హైకోర్టు తనకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. దీనిపై విచారించిన జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ వివరణ కోరుతూ మున్సిపల్‌ శాఖ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేశారు. తదుపరి విచారణ అక్టోబరు 13కు వాయిదా వేశారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.