యాప్నగరం

మహిళా న్యాయవాది సూసైడ్.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. చందానగర్‌లో ఓ మహిళా న్యాయవాది ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపింది. భవనం పైనుంచి దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే భర్త స్టేషన్‌లో లొంగిపోయాడు.

Authored byRaj Kumar | Samayam Telugu 17 Apr 2022, 12:09 pm
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. చందానగర్‌లో ఓ మహిళా న్యాయవాది ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపింది. భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu శివాని (ఫైల్)


వివరాల్లోకి వెళ్తే.. ఐదేళ్ల క్రితం అర్జున్‌ అనే వ్యక్తితో శివానికి వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున శివాని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ కలహాల కారణంగానే శివాని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని.. ఈ నేపథ్యంలోనే శివాని ఆత్మహత్యకు యత్నించినట్లు అనుమానిస్తున్నారు. ఇటు మృతురాలి భర్త అర్జున్‌ చందానగర్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.