యాప్నగరం

మాటలకందని విషాదం: కరోనాతో కొడుకు కన్నుమూత.. ఆగిపోయిన కన్నవారి గుండె

కన్నకొడుకు కరోనాతో చనిపోవడంతో ఆవేదన చెందిన తల్లిదండ్రులు కొద్ది గంటల్లోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది.

Samayam Telugu 10 May 2021, 1:44 pm

ప్రధానాంశాలు:

  • మేడ్చల్ జిల్లాలో విషాదం
  • కరోనాతో యువకుడి మరణం
  • తట్టుకోలేక ఆగిన తల్లిదండ్రుల గుండె
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image

ప్రతి తల్లిదండ్రులకు కన్న పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం మృత్యువులో కూడా తమ కొడుకును విడిచిపెట్టలేదు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లిదండ్రులు గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌‌లోని వంపుగూడలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వంపుగూడకు చెందిన హరీష్‌రెడ్డి(31)కి కరోనా సోకడంతో 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశాడు. కన్నకొడుకు ఇకలేడన్న వార్త తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు ఐదు నిమిషాల వ్యవధిలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఒకేరోజు తల్లిదండ్రులు, కొడుకు చనిపోవడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు్న్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.