యాప్నగరం

ట్రాక్టర్ రిపేర్ చేసి.. కింద నుంచేే ఆన్ చేసి దుర్మరణం

ట్రాక్టర్‌పై వెళ్తున్న మహేష్.. డీజిల్ కారుతుండటం గమనించి రోడ్డుపక్కన నిలిపివేశాడు. వెంటనే ట్రాక్టర్ దిగి మరమ్మతులు చేశాడు. అయితే ఆ సమయంలో ట్రాక్టర్ ఇంజిన్ ఆన్ లోనే ఉంచి గేర్‌లోనే ఉంది. దీంతో సీటు ఎక్కకుండానే ట్రాక్టర్ ఆన్ చేశాడు.

Samayam Telugu 17 Mar 2021, 8:03 am

ప్రధానాంశాలు:

  • ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న మహేశ్
  • డీజిల్ కారడంతో మధ్యలోనే ఆపి రిపేర్
  • గేర్ ఆన్ చేసి ఉండటంతో పైనుంచి వెళ్లిన ట్రాక్టర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రాణం తీసిన నిర్లక్ష్యం
ఓ యువకుడి నిర్లక్ష్యం అతడి ప్రాణం బలితీసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు అదే ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. ట్రాక్టర్‌కు మరమ్మతులు చేసి కిందనుంచే ఆన్‌చేయగా... ఒక్కసారిగా అది ముందుకు కదిలి డ్రైవర్‌ పైనుంచి వెళ్లడంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సాయినగర్‌, దేవేందర్‌నగర్‌ కాలనీకి చెందిన వల్లెపు మహేశ్‌ అనే 18 ఏళ్ల యువకుడు ట్రాక్టర్ డ్రైవర్.
ఈ నెల 15 మధ్యాహ్నం 12.45 గంటలకు మహేష్ కైసర్‌నగర్‌ నుంచి బాచుపల్లికి ట్రాక్టర్‌తో వస్తున్నాడు. అయితే మధ్యలో ప్రగతినగర్‌ కమాన్‌దగ్గర ట్రాక్టర్‌ ఇంజన్‌ నుంచి డీజిల్‌ కారింది. దీంతో రోడ్డు పక్కన గేర్‌లోనే ఉంచి ఆపాడు. ఇంజన్‌ పైభాగం విప్పి మరమ్మత్తులు చేశాడు. అనంతరం సీటు ఎక్కకుండానే కింద ఉండి నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ను ఆన్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ ముందుకు కదిలింది.

ఇంజన్‌ పెద్దటైరు మహేష్‌పై నుంచి వెళ్లింది. దీంతో వెంటనే అక్కడే ఉన్న స్నేహితుడు జాషువా, బాచుపల్లి పోలీసులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మహేశ్ చిచికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.