యాప్నగరం

Love: దారుణం.. ప్రేమికుడు మోసం చేశాడని.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఎంత పని చేసిందంటే?

Hyderabad: స్నేహం పేరుతో ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్న యువకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఆమెకు దగ్గరయ్యాడు.. పెళ్లి మాటొచ్చేసరికి ముఖం చాటేశాడు.. దీంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది..

Samayam Telugu 14 Feb 2022, 11:42 am
స్నేహం పేరుతో ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్న యువకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఆమెకు దగ్గరయ్యాడు.. పెళ్లి మాటొచ్చేసరికి ముఖం చాటేశాడు.. దీంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమికుల రోజు ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. తన మరణానికి ప్రేమించిన వ్యక్తే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని, సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది..
Samayam Telugu ప్రతీకాాత్మకచిత్రం


ఎస్సార్‌నగర్‌ పోలీసుల వివరాల మేరకు.. ఏపీలోని విశాఖపట్నం జిల్లా కేంద్రం రాంనగర్‌కు చెందిన వసరాల అనూష (22) హైదరాబాద్‌కు వచ్చి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మధురానగర్‌లో ఉంటోంది. కొంత కాలంగా నవీన్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకోవాలని కొద్ది రోజులుగా అనూష కోరుతోంది. దీంతో నవీన్‌ నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెందిన అనూష ఉరేసుకుంది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు తలుపు తీయకపోవడం, ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని కిటికీలు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.