యాప్నగరం

Hyderabad: పోలీసు స్టేషన్‌లో యువతి బర్త్‌డే సెలబ్రేషన్స్.. కారణమేంటంటే..!

Hyderabad: హైదరాబాద్ జియాగూడకు చెందిన ఓ యువతి పోలీసు స్టేషన్‌లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్గవి అనే యువతి పుట్టిన రోజు నాడు స్కూటీ పొగొట్టుకుంది. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గంటల వ్యవధిలో ఆమె స్కూటీని కనిపెట్టిన పోలీసులు తిరిగి ఆమెకు అప్పగించారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన యువతి స్టేషన్ ఆవరణలోనే కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 29 Nov 2022, 4:38 pm
Hyderabad: పుట్టిన రోజు అంటే ఆ సందడే వేరు. గత సంవత్సరం కంటే ఘనంగా జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటాం. బంధువులు, స్నేహితులను ఇంటికి పలిచి కొత్త బట్టలు ధరించి కేక్ కట్ చేస్తాం. కానీ ఈ యువతి మాత్రం పోలీసు స్టేషన్‌లో తన జన్మదిన వేడుకలు జరుపుకుంది. పోలీసుల మధ్య కేక్ కట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది.
Samayam Telugu Birthday in Police Station
పోలీసు స్టేషన్‌లో బర్త్‌డే వేడుకలు


వివరాల్లోకి వెళితే.. జియాగూడకు చెందిన జి.భార్గవి టిఫిన్ చేసేందుకు తన ఇంటిన నుంచి బయటకు వచ్చింది. బొగ్గులకుంటలోని రాయల్ టిఫిన్ సెంటర్ బయట తన స్కూటీని పార్క్ చేసి టిఫిన్ చేసేందుకు లోపలికి వెళ్లింది. టిఫిన్ చేసి బయటకు వచ్చే లోగా తన స్కూటీ కనపించలేదు. టిఫిన్ సెంటర్ సిబ్బందిని ఆరా తీయగా.. తమకు తెలియదని సమాధానం చెప్పారు. దీంతో ఆమె వెంటనే సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సీఐ బాలగంగిరెడ్డి పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలించి బైక్ దొగింలిచిన వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం స్కూటీని భార్గవికి అప్పగించారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన భార్గవి ఈరోజు తన పుట్టినరోజుని.., ఈ రోజు తన స్కూటీని పొగొట్టుకుని ఉంటే చాలా బాధపడేదాన్ని తెలిపింది. తన స్కూటీని తిరిగి తనకు అప్పగించిన పోలీసులకు థ్యాంక్స్ చెప్పింది. అనంతరం పోలీసు స్టేషన్ ఆవరణలోనే కేక్ కట్ చేసి తన బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంది.

Read Latest Telangana News and Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.