యాప్నగరం

సీపీ సజ్జనార్ చెప్పినా వినని డీసీపీ.? పక్కకు పొమ్మంటూ.. హుకుం

డెలివరీ బాయ్స్‌ను పోలీసులు అడ్డుకున్న విషయం తెలుసుకుని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో డీసీపీ దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వచ్చాయి. సీపీ చెప్పినా వినలేదన్న విమర్శలున్నాయి.

Samayam Telugu 24 May 2021, 8:07 pm
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌పై హైదరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల కిందట డెలివరీ బాయ్స్‌ని రోడ్డుపై నిలిపివేయడం.. వారిని అనుమతించకపోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ రోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో స్విగ్గీ, జొమాటో రైడర్లను డీసీపీ విజయ్ కుమార్ ఆపేశారు. ఫొటో తీసేందుకు వెళ్లిన జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
Samayam Telugu మీడియా ప్రతినిధిని పక్కకు నెట్టేస్తున్న పోలీసు
police


మీకు ఇక్కడేం పని.. రోడ్డు అవతలికి వెళ్లి ఫొటోలు తీసుకోవాలంటూ డీసీపీ విజయ్ కుమార్ అన్నారు. దీంతో జర్నలిస్టులు దగ్గర్లోనే ఉన్న సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ దృష్టికి విషయం తీసుకెళ్లారు. ఆయన చెప్పినా పట్టించుకోకుండా డీసీపీ చిర్రుబుర్రులాడినట్లు తెలుస్తోంది. మీకు పేపర్‌లో యాడ్‌లు ఇస్తారని వాళ్లని సపోర్ట్ చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మా ఉద్యోగం మేము చేస్తున్నామంటూ డీసీపీ విజయ్ తేల్చిచెప్పారు. డీసీపీ ఆదేశాలతో ఫొటో జర్నలిస్టులను ఎస్‌వోటీ పోలీసులు అక్కడి నుంచి దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటనతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.